http://www.facebook.com/manapalakollu
కార్తీక పౌర్ణమి సాయం సమయంలో ఆరుబయట నిలబడి పైకి చూస్తే నిర్మలంగా ఉన్న ఆకాశం కనిపిస్తుంది. పాలసముద్రంలో విహరిస్తున్న రాజహంసలాగా నిండుచంద్రుడు కనిపిస్తాడు. సంవత్సరంలోని మిగిలిన పదకొండు నెలల వెన్నెల ఈనాటి శరత్కాలపు వెన్నె లకు సాటిరాదు. ఇదే కార్తీక పౌర్ణమి ప్రత్యేకత. కార్తీకంతో సమానమైన మాసమూ, వేదంతో సమానమైన శాస్త్రమూ లేవని రుషివచనం. కార్తీక మాసం శివ,కేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం. అందువల్లనే ఈ మాసంలో కేవలం శివుడిని మాత్రమే కాకుండా కార్తీక దామోదరుడు అనే పేరుతో విష్ణూమూర్తిని (KSHETRA PALAKA OF PALAKOLLU IS JANARDHAN SWAMY) కూడా పూజిస్తున్నాం. ఇక జ్యోతిష్యశాస్త్ర రీత్యా చంద్రుడు మనః... కారకుడు, పౌర్ణమి తిథికి అధిపతి. చంద్రుడికి ప్రాధాన్యం కలగిన ఈ కార్తీక పౌర్ణమినాడు ఆరాధన చేస్తే మానసిక ప్రశాంతత, ఆనందం లభిస్తాయంటారు. ఈ కార్తీక పౌర్ణమి మీ జీవితంలో ప్రశాంతత, ఆనందం చేకూర్చాలని ఆశిస్తున్నాను - మన పాలకొల్లు