https://www.facebook.com/manapalakollu
మిత్రులందరికి శివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి రోజున శ్రీ పరమేశ్వరుడు లింగాకారుడుగా ప్రతి దేవాలయములో కనిపిస్తాడు. అట్టి శివునకు అభిషేకములు, పూజలు ఆ రోజు జరిపినచో శివ సన్నిధానమునకు చేరుదురని భక్తుల విశ్వాసము. ఈ రోజున భక్తులు ఉపవాసముండి, శివునికి పూజలు నిర్వహించి భక్తి పాటలు, భజనలతో రాత్రి నిదురించ కుండా జాగరణ చేయుదురు. శివరాత్రి రోజున ఒక్క బిల్వపత్రమైనను శివునికి సమర్పించినచో జన్మరాహిత్యము, ముక్తి కలుగునని శివభక్తుల నమ్మకము. ఆ పర్వదినమునందు శివలింగము జ్యోతిర్లింగముగా వెలుగొందుతుంది.